Tollywood: టాలీవుడ్ హాస్య నటి విద్యుల్లేఖ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్.. ఫొటోలు, వీడియోలు పోస్ట్!

  • హాస్యనటిగా ‌తెలుగు తెరపై నవ్వులు
  • ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందన్న నటి
  • వేరే నటి ఫొటోలు అప్‌లోడ్
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటిగా తనదైన ముద్ర వేసుకున్న నటి విద్యుల్లేఖ ఫేస్‌బుక్ అకౌంట్‌ను కొందరు హ్యాక్ చేశారు. ఆమెకు సంబంధంలేని ఫొటోలు, వీడియోలను అందులో పోస్టు చేశారు. ఈ విషయాన్ని విద్యుల్లేఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. తనకో విచిత్రమైన, భయంకరమైన అనుభవం ఎదురైందని పేర్కొంటూ తన ఫేస్‌‌బుక్ ఖాతా హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడించింది. తన ఖాతాను హ్యాక్ చేసిన వారు అందులో  వేరే నటి ఫొటోలు, వీడియోలను పోస్టు చేశారని పేర్కొంది. తన పేజీని తానే నిర్వహించుకుంటున్నా ఇదెలా జరిగిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఖాతా హ్యాక్‌కు గురైన విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది. 
Tollywood
Actress
Vidyullekha Raman
Facebook

More Telugu News