devineni uma: చెప్పులు వేయించే సంస్కృతి మాది కాదు: దేవినేని ఉమ

  • హింసా రాజకీయాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించదు
  • కావలి ఘటనపై పోలీస్ దర్యాప్తు జరుగుతోంది
  • తెలుగు జాతిని అవమానించేలా కేంద్రం వ్యవహరిస్తోంది
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఓ వ్యక్తి చెప్పు విసిరిన సంఘటన నేపథ్యంలో టీడీపీపై భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చెప్పులు వేయించే సంస్కృతి తమది కాదని, హింసా రాజకీయాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించదని అన్నారు. కావలిలో కన్నాపై చెప్పు విసిరిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. తెలుగు జాతిని అవమానించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రెవెన్యూ లోటులో సగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
devineni uma

More Telugu News