Andhra Pradesh: ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందనే కన్నాపై చెప్పు విసిరాను: నిందితుడు ఉమామహేశ్వరరావు

  • కన్నాపై చెప్పు విసిరిన ఉమా మహేశ్వరరావు లారీ డ్రైవర్ 
  • సమాజంపై విరక్తి చెందానని చెప్పాడు 
  • ఏపీకి జరుగుతున్న అన్యాయం చూసి భరించలేకపోయానన్నాడు: పోలీసులు
నెల్లూరు జిల్లా కావలిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరిన విషయం తెలిసిందే. అతన్ని బీజేపీ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడి విషయమై పోలీసులు నిందితుడిని విచారించారు.

నిందితుడు ఉమామహేశ్వరరావు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. సమాజంపై విరక్తి చెందానని, అలాగే, ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వకుండా చేస్తున్న అన్యాయం చూసి భరించలేకపోయానని.. అందుకే, కన్నాపై చెప్పు విసిరానని నిందితుడు తమకు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
Andhra Pradesh
kanna

More Telugu News