Botsa Satyanarayana: నాలుగేళ్ల పాటు దీక్షలు చేయలేదు... ఇప్పుడు చేస్తున్నారు: బొత్స సత్యనారాయణ ఎద్దేవా

  • హాస్యాస్పదంగా ఉంది
  • టీడీపీలో మొత్తం 18 మంది ఎంపీలున్నారు
  • ఇంతమంది ఏం సాధించారు
  • ఎన్నికలు దగ్గరపడుతున్నందుకే నాటకాలు
టీడీపీ నేతలపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈరోజు విశాఖపట్నానికి రైల్వే జోన్‌ కోసం టీడీపీ ఎంపీలు ఒకరోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాటు దీక్షలు చేయని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్ష చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ నుంచి కొనుక్కున్న ఎంపీలతో కలిపి ఇప్పుడు టీడీపీలో మొత్తం 18 మంది ఎంపీలు  ఉన్నారని, ఇంతమంది వుండి ఏం సాధించారని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందుకే వారు నాటకాలు ఆడుతున్నారని, విభజన హామీల్లో ఉన్న రైల్వే జోన్‌ గురించి ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తమ పార్టీ వైజాగ్‌ రైల్వే జోన్‌ను సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
Botsa Satyanarayana
YSRCP
Telugudesam

More Telugu News