gopichand: దర్శకుడు చక్రి విషయంలో మొదట్లో భయం వుండేది: గోపీచంద్

  • కథ చెప్పడానికి చక్రి వచ్చాడు 
  • నేను పెద్దగా ఆసక్తిని చూపించలేదు
  • ఆ తరువాత ఆయనపై గురి కుదిరింది  
ఒక వైపున యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో గోపీచంద్ విజయం సాధించాడు. ఈసారి కూడా ఆయన అదే తరహా కథను ఎంచుకుని 'పంతం' సినిమా చేశాడు. చక్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రేపు విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ .. "దర్శకుడిగా చక్రికి ఇది మొదటి సినిమా .. అందువలన ఆయన కథ వినిపించడానికి వచ్చినప్పుడు నేను పెద్దగా ఆసక్తిని చూపించలేదు. కానీ కథ ముందుకు వెళుతున్న కొద్దీ నాలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. కానీ చెప్పిన సీన్ ను చెప్పినట్టుగా తెరపై చూపించగలుగుతాడా? అనే భయం వేసింది. ఆరంభంలో షూటింగ్ కాగానే ఆ విజువల్స్ చూసేవాడిని .. ఆయన అనుకున్నది  అనుకున్నట్టుగా తీయగలడు అనే నమ్మకం అప్పుడు కుదిరింది. కథలో దమ్ము .. దానిని తెరపై చూపించే సత్తా వున్న కొత్త దర్శకులతో చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.   
gopichand
mehreen

More Telugu News