nagari: పుత్తూరులో రోజాను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. తీవ్ర వాగ్వివాదం

  • పుత్తూరు ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం 
  • పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, రోజా
  • ఉద్రిక్త వాతావరణం
  • భారీగా మోహరించిన పోలీసులు
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సదరు ఆసుపత్రిలో అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వచ్చారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు రోజా కూడా అక్కడకు వచ్చారు. దీంతో ఆమె రాకను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోజాకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
nagari
roja
YSRCP
Telugudesam

More Telugu News