Andhra Pradesh: కేంద్రం నిధులు ఖర్చుపెడుతూ, మీవని ప్రచారం చేసుకుంటారా?: నిప్పులు చెరిగిన కన్నా

  • రాష్ట్రాభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి వుంది
  • అన్ని సంక్షేమ పథకాల నిధులూ కేంద్రానివే
  • జన్మభూమి కమిటీల పేరిట డబ్బు మింగుతున్న టీడీపీ
  • బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తూ, అవన్నీ రాష్ట్ర నిధులని తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు సర్కారు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు మింగేస్తోందని, తామిచ్చే డబ్బు ఖర్చుచేస్తూ, సొంత నిధులన్నట్టు చెప్పుకుంటోందని ఆరోపించారు.

రైతులకు ఏం చేశారన్న విషయమై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన, అప్పుడు అసలు విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నకిలీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేదల గృహ నిర్మాణ పథకం నిధుల్లో కమీషన్లు తీసుకుంటున్నారని, ప్రతి విభాగంలో కాంట్రాక్టులిచ్చి, వారి నుంచి కమీషన్లను నేతలు పుచ్చుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడివుందని, జరిగే ప్రతి అభివృద్ధీ కేంద్ర నిధులతోనేనని అన్నారు.
Andhra Pradesh
Kanna Lakshminarayana
Telugudesam
BJP
Janmabhoomi

More Telugu News