Supreme Court: ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గెలిచింది: అరవింద్ కేజ్రీవాల్

  • ట్విట్టర్ ఖాతాలో స్పందించిన కేజ్రీవాల్
  • ఢిల్లీ ప్రజలు విజయం సాధించారని వ్యాఖ్య
  • కోర్టు తీర్పుపై హర్షం
న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మధ్య నెలకొన్న వివాదంలో సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక తీర్పును వెలువరించగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన ఘన విజయమని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తూ, కేజ్రీవాల్ కు పాలనాపరంగా మరింత స్వేచ్ఛను ఇచ్చేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాత్ర పరిమితమేనని, పెత్తనం చలాయించేందుకు కాదని పేర్కొంది.
Supreme Court
India
New Delhi
Aravind Kejriwal
AAP

More Telugu News