amit shah: విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో అమిత్ షాపై ఫిర్యాదు

  • అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న బ్యాంకులో ఒక్క రాత్రే రూ. 750 కోట్లు మారాయి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనపై చర్యలు తీసుకోవాలి
  • బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను సాగిస్తోంది
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై విశాఖపట్నం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అమిత్ డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకులో ఒకే రోజు రూ. 750 కోట్లు మారాయని... ఆయనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు సీఐ తిరుమలరావుకు ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర ఇన్ ఛార్జి నగేష్ కరియప్ప, రాష్ట్ర అధ్యక్షుడు భగత్ తదితరులు ఫిర్యాదును అందించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఒక్కరాత్రిలోనే రూ. 750 కోట్లు ఎలా మారాయని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, బీజేపీ ప్రజావ్యతిరేక పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. అమిత్ షాను ప్రధాని మోదీ సాగనంపాలని డిమాండ్ చేశారు.
amit shah
police case
visakhapatnam
nsui

More Telugu News