నేను కావాలనుకున్నవి దక్కనప్పుడు పోరాడాను!: హీరోయిన్‌ కంగనా

  • నేను కావాలని కోరుకున్న ప్రతిదీ నాకు చెడు చేసేదే
  • నాకు చాలా విషయాలు తెలియవని అర్థమైంది
  • అందుకే దేవుడిపై భారం వేశాను
  • కోరుకున్నది ఇవ్వకుండా చాలా దయతో దేవుడు వ్యవహరించాడు
తాను కావాలని కోరుకున్న ప్రతిదీ తనకు చెడు చేసేదేనని బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ అంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకుండా ఉండడంపై మాట్లాడింది. తాను పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నానని, కానీ అది జరగకపోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది. తన ప్రేమ విఫలం అయిన తరువాత దేవుడు తనను రక్షించాడని చాలా సార్లు అనుకున్నానని చెప్పింది.

తాను ఏది కావాలనుకున్నా తాను దానికి అర్హురాల్ని కాదని చాలామంది తక్కువ అంచనా వేశారని, మోడలింగ్‌ చేసి, తన తల్లిదండ్రుల దగ్గర తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నానని, కానీ మోడలింగ్‌ ప్రపంచం తనను తిరస్కరించిందని బాధపడింది. తాను కోరుకున్న చాలా విషయాల్లో ఇలాగే జరిగిందని తెలిపింది.

తాను కావాలనుకున్నవి తనకు దక్కనప్పుడు పోరాడానని, కన్నీరు పెట్టుకున్నానని కంగనా తెలిపింది. తనకు చాలా విషయాలు తెలియవని ప్రస్తుతం తనకు బాగా అర్థమైందని, అందుకే తాను దేవుడిపై భారం వేశానని తెలిపింది. ఆ భగవంతుడు తాను ఏది కోరుకుంటే అది ఇవ్వకుండా తన పట్ల చాలా దయతో వ్యవహరించాడని చెప్పింది.   
Go Back to Shorts
kangana
Bollywood

More Telugu News