Pawan Kalyan: వీళ్లు ఏపీకి పట్టిన శనిగ్రహాలు: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో శాంతి భద్రతలు కరవయ్యాయని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను బీజేపీ ఏపీ నేతలు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ, ‘అది గవర్నర్ బంగ్లానా? ఉమ్మడి రాష్ట్రాల బీజేపీ కార్యాలయమా? అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించమని కోరాల్సిన అవసరమేముంది? ఏపీకి పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంపైనా, చంద్రబాబుపైనా బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. ఒకప్పుడు శనిగ్రహాలు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ అలాంటి గ్రహాలే రాష్ట్రానికి పట్టాయి. దీంతో, ప్రజలు బాధపడుతున్నారు. అసలు విషయాలు తెలుసుకుని జీవీఎల్ మాట్లాడాలి. బీజేపీకి ప్రజలు తగినబుద్ధి చెప్పడం ఖాయం’ అని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
budha venkanna

More Telugu News