Jagan: జగన్‌కు సీఎం పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతున్నారు: దేవినేని ఉమా మహేశ్వరరావు

  • జగన్‌ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రజలవి
  • వాటిని స్వాధీనం చేసుకోవాలి
  • ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు రూ.1,590 కోట్లు ఖర్చు చేశాం
  • గతంలో పదవుల్లో ఉన్న వారు ఉత్తరాంధ్రకు ఏం చేశారు?  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి సీఎం కావాలన్న పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రజలవని, వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.1,590 కోట్లు ఖర్చు చేశామని అన్నారు.                                        

గతంలో పదవుల్లో ఉన్న వారు ఉత్తరాంధ్రకు ఏం చేశారని దేవినేని ఉమా మహేశ్వరరావు నిలదీశారు. అప్పట్లో ప్రాజెక్టుల పేరుతో డబ్బులు కాజేసేందుకే ప్రయత్నించారని, పదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో నీళ్లు ఇచ్చామని, ఇప్పుడు తోటపల్లి ప్రాజెక్టులో సెల్ఫీలు తీసుకున్న నేతలు తమని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.                
Jagan
devineni
Andhra Pradesh
Telugudesam

More Telugu News