vishnu kumar raju: సీఎం రమేష్ దీక్షను ‘గిన్నిస్’ కెక్కించాల్సిందే!: విష్ణుకుమార్ రాజు సెటైర్లు

  • షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరు
  • రమేష్ మాత్రం ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేశారు!
  • రమేష్ వల్ల దీక్షలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోయింది 
సీఎం చంద్రబాబుకు ప్రశంసలు, టీడీపీ నేత సీఎం రమేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరని, అలాంటిది సీఎం రమేష్ పదకొండు రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేయడం సాధారణ విషయం కాదని, ఈ దీక్షను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలంటూ సెటైర్లు విసిరారు. రమేష్ వల్ల దీక్షలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోయిందని విమర్శించారు. కాగా, ఏపీలో హోంగార్డుల కష్టాలు గుర్తించి వారి జీతాలు పెంచినందుకు సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్పకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
 
vishnu kumar raju
CM Ramesh

More Telugu News