kcr: కేసీఆర్, హరీష్ ల అవినీతి బయటపెడతా: నాగం జనార్దన్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
కేసీఆర్, హరీష్ రావుల అవినీతి బయటపెడతానని, వాళ్లిద్దరినీ జైలుకు పంపిస్తానంటూ కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అవినీతిపై ప్రశ్నించినందుకే తనకు సెక్యూరిటీ తగ్గించారని, ఆయనకు నిజాయతీ ఉంటే తాను అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

కాళేశ్వరంపై పెయిడ్ ఆర్టికల్ తో టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని.. ‘దోచుకో - దంచుకో - దాచుకో’ స్కీమ్ తో టీఆర్ఎస్ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి అద్భుతమైన పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని ప్రశంసించారు.
Go Back to Shorts
kcr
nagam

More Telugu News