roja: కనీసం చివరి రోజుల్లోనైనా రాష్ట్రం కోసం పని చేయండి: రోజా

  • జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • టీడీపీ నేతలు ఎలాంటి వారో దేవినేని ఉమాను చూస్తే అర్థమవుతుంది
  • 2019 నుంచి రాష్ట్రాన్ని పాలించేది వైసీపీనే
వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సిగ్గులేకుండా జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజల వద్దకు వెళ్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని అన్నారు. జగన్ పట్ల వెన్నెముక లేని మంత్రి దేవినేని ఉమ ప్రవర్తిస్తున్న తీరు టీడీపీ నేతలు ఎలాంటి వారో సూచిస్తోందని అన్నారు. కనీసం ఈ చివరి రోజుల్లోనైనా రాష్ట్రం కోసం పని చేయాలని టీడీపీ నేతలను కోరుకుంటున్నానని చెప్పారు. 2019 నుంచి ఏపీని వైసీపీ పాలించబోతోందని అన్నారు.
roja
jagan
devineni uma

More Telugu News