jc bros: జేసీ బ్రదర్స్ నుంచి మాకు ప్రాణహాని ఉంది: తాడిపత్రి జగ్గీ బ్రదర్స్ ఆరోపణ

  • మాకు రక్షణ కల్పించాలి
  • జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు
  • ఈ విషయాన్ని  నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం
తాడిపత్రి నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, బొమ్మిరెడ్డి జయచంద్రారెడ్డి (జగ్గీ బ్రదర్స్) లు మనస్పర్థల కారణంగా టీడీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు జే సి దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ బ్రదర్స్) నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు.  

జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని తాము నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జేసీ కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు ఓ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. తమకు ఏ హాని జరిగినా జేసీ బ్రదర్స్, వాళ్ల కొడుకులే కారణమని చెప్పిన జగ్గీ బ్రదర్స్, ఇకపై జేసీ సోదరుల ఓటమికి తాము కృషి చేస్తామని చెప్పారు.
jc bros
jaggi bros

More Telugu News