Pawan Kalyan: తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని సందర్శించిన పవన్.. కార్మికుల కోసం విరాళాలు సేకరిస్తామని హామీ!

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఈరోజు తమ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, తుమ్మపాలలో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. మూత పడడానికి గల కారణాలను గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులను ఆదుకునేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మిక సంక్షేమ సంఘానికి రూ.2 లక్షలు ప్రకటించారు. తమ పార్టీ తరఫున మరిన్ని విరాళాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు.  
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News