Pawan Kalyan: తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని సందర్శించిన పవన్.. కార్మికుల కోసం విరాళాలు సేకరిస్తామని హామీ!

  • విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జనసేనాని
  • తుమ్మపాలలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీని సందర్శించిన పవన్
  • కార్మికులను ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ
విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఈరోజు తమ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, తుమ్మపాలలో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. మూత పడడానికి గల కారణాలను గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులను ఆదుకునేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మిక సంక్షేమ సంఘానికి రూ.2 లక్షలు ప్రకటించారు. తమ పార్టీ తరఫున మరిన్ని విరాళాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు.  
Pawan Kalyan
Jana Sena

More Telugu News