యాదగిరిగుట్ట పుష్కరిణి మూసివేత.. విస్తరణ పనులు షురూ!
- రూ. 20 కోట్లతో విస్తరణ పనులు
- రెండు నెలల పాటు మూసివేత
- ప్రకటించిన వైటీడీఏ
పుష్కరిణి ముందు కమాన్, దానిపై విష్ణుమూర్తి విగ్రహం, నీటి మధ్యలో మండపం, దానిపై స్వామివారి పాదాలు, కొలను చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు కానున్నాయి. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ పుష్కరిణిలో నిత్యమూ నీరు ఊరుతుంటుంది. దీని వెడల్పు 36 మీటర్లు కాగా, పొడవు 18 మీటర్లుంది. లోతు చాలా తక్కువ. ప్రస్తుతమున్న పుష్కరిణి, పెరుగుతున్న భక్తుల అవసరాలకు సరిపోవడం లేదని భావించిన అధికారులు, విస్తరణ పనులు చేపట్టారు.