janasena: టీడీపీ పట్టించుకోదు.. ఆ విషయం కేసీఆర్‌తో నేనే మాట్లాడతా!: పవన్ కల్యాణ్

  • 23 కులాలను ఓసీల్లో చేర్చిన తెలంగాణ ప్రభుత్వం
  • ఉత్తరాంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు
  • చంద్రబాబు పట్టించుకోలేదు
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన బిడ్డలు ఎలా ఉంటారో, అందరూ అలానే ఉండాలని కోరుకుంటానని అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం ఎస్.కోటలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 వెనకబడిన కులాలను కేసీఆర్ ప్రభుత్వం ఓసీల్లో చేర్చిందని, దీనివల్ల హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తరాంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యను టీడీపీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఇకపై ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు పవన్ భరోసా ఇచ్చారు.
janasena
Pawan Kalyan
Andhra Pradesh
Vizianagaram

More Telugu News