Kerala: కేరళ కూలీ పాడిన పాట వైరల్.. ఫిదా అయిపోయిన శంకర్‌ మహదేవన్‌

  • 'విశ్వరూపం' సినిమాలోని పాట పాడిన కూలీ 
  • నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు
  • అతడి ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్న శంకర్‌ మహదేవన్‌
  • ఫోన్‌ చేసి మరీ మాట్లాడిన వైనం
కేరళకు చెందిన ఓ కూలీ పాడిన పాటకు ప్రసిద్ధ గాయకుడు శంకర్ మహదేవన్ సైతం ఫిదా అయిపోయారు. రాకేశ్ అనే సదరు కూలీ 'విశ్వరూపం' సినిమాలోని ఉనయ్ కానధు నాన్ అనే పాటను పాడుతుండగా అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ కూలీ గొంతు అద్భుతంగా ఉండడంతో నెటిజన్లు విపరీతంగా షేర్లు చేయడంతో ఈ విషయం శంకర్ మహదేవన్ దృష్టికి వచ్చింది.

ఇంత మంచి వాయిస్ ఉన్న వ్యక్తితో కలిసి పనిచేయాలనుందంటూ తాజాగా ఆయన ట్వీట్ చేశారు. అతడు ఎవరో ఎక్కడుంటారో అడిగారు. అనంతరం ఆ కూలీ ఫోన్‌ నెంబర్‌ను తెలుసుకుని మరీ ఫోన్ చేశారు. 'విశ్వరూపం' సినిమాలోని ఉనయ్ కానధు నాన్ అనే పాటను పాడింది శంకర్ మహదేవనే. తన పాటకు వచ్చిన స్పందనపై స్పందించిన కూలీ రాకేశ్‌.. తాను నిజంగా నమ్మలేకపోతున్నానని, తన వాయిస్ బాగుందని ఏకంగా శంకర్ చెప్పారని హర్షం వ్యక్తం చేశాడు.
Kerala
Viral Videos
song

More Telugu News