elections: జమిలి ఎన్నికలపై సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తోన్న లా కమిషన్!

  • ఈ నెల 7, 8 తేదీల్లో సంప్రదింపులు
  • దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు
  • ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలకు ఆహ్వానాలు
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై చర్చ జరుగుతోన్న వేళ ఈ విషయంపై లా కమిషన్‌ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలపై సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 7, 8 తేదీల్లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో లా కమిషన్‌ సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది.

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించి, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోనుంది. అలాగే, ప్రజల నుంచి సలహాలు, సూచనలను కూడా ఆహ్వానించింది. కాగా, గతంలోనూ లా కమిషన్‌ ప్రజల నుంచి సూచనలు కోరిన విషయం తెలిసిందే.                                         
elections
India

More Telugu News