Rajinikanth: రాజ్ ఠాక్రేతో రజనీకాంత్ భార్య భేటీ!

  • ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపిన రాజ్‌ ఠాక్రే
  • రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ
  • గతంలోనూ మహారాష్ట్ర నేతలతో రజనీ కుటుంబీకుల భేటీ
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేతో సినీనటుడు రజనీ కాంత్ భార్య లతా రజనీకాంత్ సమావేశమయ్యారు. తాజాగా, రాజ్ ఠాక్రే తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. వారిద్దరి మధ్య రాజకీయ, సామాజిక అంశాలతో పాటు సినిమాల గురించిన చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. కాగా, మహారాష్ట్ర రాజకీయ నేతలతో రజనీ కుటుంబీకులు గతంలోనూ పలుసార్లు సమావేశమయ్యారు. మరోవైపు రజనీ కూడా ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.
Rajinikanth
Maharashtra

More Telugu News