Ramcharan: హైదరాబాద్ శివారులో ఫిల్మ్ స్టూడియో నిర్మించే యోచనలో రామ్ చరణ్!

  • సైరా సినిమా షూటింగ్ కోసం 22 ఎకరాల్లో భారీ సెట్
  • ఈ స్థలంలోనే ఫిల్మ్ స్టూడియోని స్థాపించే యోచనలో చరణ్
  • దశాబ్దాల చిరంజీవి కోరిక నెరవేరినట్టే
మెగాస్టార్ చిరంజీవి తన సినీ చరిత్రలో ఎన్నో గొప్ప విజయాలు సాధించి అగ్ర నటుడిగా ఎదిగారు. కానీ తన ఫ్యామిలీకంటూ ఓ సొంత ఫిల్మ్ స్టూడియో నిర్మించాలని కన్న కలలను మాత్రం ఇంతవరకూ నెరవేర్చుకోలేక పోయారు. దశాబ్దాల ఆయన కల ఇప్పుడు నెరవేరబోతోంది. చిరంజీవి కోరికను ఆయన తనయుడు రామ్ చరణ్ త్వరలో నెరవేర్చబోతున్నాడని సమాచారం.

ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు కొణిదల ప్రొడక్షన్స్ ను స్థాపించి భారీ చిత్రాలను నిర్మిస్తున్న రామ్ చరణ్, ప్రస్తుతం ఈ ప్రొడక్షన్స్ లోనే 'సైరా' నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ శివారులో భారీ సెట్ ను వేశారు. 22 ఎకరాల్లో ఉన్న ఈ భారీ సెట్ స్థలంలోనే ఓ మెగా స్టూడియో నిర్మించాలని చరణ్ భావిస్తున్నాడట. ఇదే జరిగితే మెగా ఫ్యామిలీకి సొంత ఫిల్మ్ స్టూడియో ఏర్పడడంతో పాటు చిరంజీవి తీరని కోరిక కూడా తీరినట్టే.
Ramcharan
Chiranjeevi
Hyderabad
Hyderabad District
Telangana
Tollywood

More Telugu News