KCR: తెలంగాణలో కాంగ్రెస్ తో చంద్రబాబు కలవాల్సిందే: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ ను అడ్డుకోవాలంటే విపక్షాల ఐక్యత తప్పదు
  • మోదీకి ఏజెంటులా వ్యవహరిస్తున్న కేసీఆర్
  • వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న రేవంత్ రెడ్డి
వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించాలంటే పొత్తు అనివార్యమని, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిస్తే మాత్రమే కేసీఆర్ ను అడ్డుకోవచ్చని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీకి ఓ ఏజెంటులా కేసీఆర్ పని చేస్తున్నారని ఆరోపించిన ఆయన, బీజేపీని అడ్డుకునేందుకు బీహార్, ఉత్తరప్రదేశ్ లో విపక్షాలు చూపిన ఐక్యతను తెలంగాణలో చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే చంద్రబాబునాయుడు, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు.
KCR
Telangana
Revanth Reddy
Chandrababu
Telugudesam
Congress

More Telugu News