amit shah: ఒడిశా బీజేపీ నేతలకు టార్గెట్ విధించిన అమిత్ షా

  • 147 స్థానాల్లో 120కి పైగా స్థానాల్లో గెలవాలి
  • 18 ఏళ్ల బీజేడీ పాలనకు చరమగీతం పాడాలి
  • నవీన్ పట్నాయక్ ను ఓడించేందుకు సన్నద్ధం కావాలి
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాల్లో 120కి పైగా స్థానాల్లో విజయం సాధించాలంటూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా టార్గెట్ విధించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు పలువురు సీనియర్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. 18 ఏళ్ల బిజూ జనతాదళ్ పాలనకు చరమగీతం పాడాలని, సీఎం నవీన్ పట్నాయక్ ను ఓడించేందుకు బీజేపీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఒడిశాలో పార్లమెంటు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో... ఆ రాష్ట్రంపై అమిత్ షా దృష్టి సారించారు. గత రెండేళ్లలో ఎనిమిది సార్లు రాష్ట్రంలో పర్యటించారు. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. 
amit shah
navin patnaek
odisha

More Telugu News