Big Boss-2: బిగ్ బాస్ హౌస్ నుంచి కిరీటి ఎలిమినేషన్... బయటకు వచ్చి కన్నీరు!

  • జాబితాలో గీతా మాధురి, గణేష్, కిరీటి
  • సేఫ్ జోన్ లో గీత, గణేష్
  • బయటకు వచ్చేసిన కిరీటి దామరాజు
తెలుగు టీవీ ప్రియులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ -2, మూడవ వారంలో నటుడు కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లోని అత్యధికులు కిరీటిని బయటకు పంపించాలని నిర్ణయించారు. దీంతో బయటకు వచ్చిన కిరీటిని బోన్ లో నిలబెట్టిన హోస్ట్ నాని, కిరీటి మంచి వ్యక్తని చెబుతూ, హౌస్ లోని కంటెస్టెంట్ లను కిరీటి గురించి మాట్లాడాలని అడిగాడు. కిరీటి గురించి తనీష్, బాబు గోగినేని, సామ్రాట్ తదితరులు పాజిటివ్ గా చెబుతున్న వేళ కిరీటి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

తొలి వారంలో సభ్యులతో ఎంతో కలసిపోయిన కిరీటి, రెండో వారంలో కెప్టెన్ టాస్క్ తీసుకుని కౌశల్ పట్ల వికృతంగా ప్రవర్తించడం, ముఖ్యంగా ఒక్క ఎపిసోడ్ లో కిరీటి తన వైఖరితో ప్రేక్షకులకు దూరమయ్యాడని ఈ సందర్భంగా నాని తెలిపాడు. తాను హౌస్ లో బాగానే ఉన్నా కూడా ఎలిమినేట్ అయ్యానని కిరీటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా, ఎలిమినేషన్ జాబితాలో గీతా మాధురి, కిరీటి, గణేష్ లు ఉండగా, గీత, గణేష్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడంతో కిరీటి బయటకు రాక తప్పలేదు.
Big Boss-2
Tollywood
Kireeti Damaraju
Nani
Elimination

More Telugu News