China: 'అన్ లిమిటెడ్ ఆఫర్' ప్రకటించి... తట్టుకోలేక హోటల్ ను మూసేసుకున్న ఆసామి!

  • కస్టమర్ల కోసం ఆఫర్ ప్రకటించిన బీజింగ్ రెస్టారెంట్
  • వచ్చిన వారి ధాటికి తట్టుకోలేకపోయిన యజమాని
  • హోటల్ ను మూసేస్తున్నట్టు ప్రకటన
తమ హోటల్ లేదా రెస్టారెంట్ కు కస్టమర్లు ఎగబడి రావాలన్న ఆలోచనతో ఎన్నో రకాల ఆఫర్లను యజమానులు ప్రకటిస్తుంటారు. కానీ, బీజింగ్ సమీపంలో 'జియా మెర్నర్' పేరిట రెస్టారెంట్ ను ప్రారంభించిన ఓ ఆసామి మాత్రం చేదు అనుభవాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది. కస్టమర్లను అధికంగా రప్పించేందుకు రూ. 1300కు 'అన్ లిమిటెడ్ ఫుడ్' అని ఓ ఆఫర్ ను ఆయన ప్రకటించాడు.

 దీని గురించి తెలుసుకున్న ఆహార ప్రియులు లొట్టలేసుకుంటూ వచ్చి హోటల్ ముందు క్యూ కట్టగా సంబరపడిపోయాడు. కానీ ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అయింది. వచ్చిన వారంతా తిన్నంత తిని, స్వయంగా పార్శిల్ చేసుకుని వెళ్లడం ప్రారంభించారట. దీంతో నష్టాలు ప్రారంభం కావడంతో చేసేదేమీ లేక, రెస్టారెంట్ ను మూసేస్తున్నట్టు ప్రకటించాడు.
China
Hotel
Un Limited Offer
Customers

More Telugu News