argentina: అర్జెంటీనా ఫుట్ బాల్ టీమ్ పై మండిపడ్డ డీగో మారడోనా

  • ఎలా అటాక్ చేయాలో ఆటగాళ్లకు తెలియలేదు
  • బంతి తమ వద్ద ఉన్నప్పుడు ఎలా ఆడాలో వారికి అర్థం కాలేదు
  • అర్జెంటీనా కంటే ఫ్రాన్స్ జట్టులోనే ఎక్కువ ప్రత్యేకతలు కనబడ్డాయి
ఫిఫా వరల్డ్ కప్ నుంచి హాట్ ఫేవరేట్ అర్జెంటీనా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా తమ టీమ్ పై విరుచుకుపడ్డాడు. అర్జెంటీనా ఆటగాళ్లకు ఎలా అటాక్ చేయాలో తెలియలేదని, బంతి వారి వద్ద ఉన్నప్పుడు ఎలా ఆడాలో కూడా అర్థం కాలేదని మండిపడ్డాడు. అర్జెంటీనా జట్టులో కనపడని ఎన్నో ప్రత్యేకతలు ఫ్రాన్స్ జట్టులో కనపడ్డాయని చెప్పాడు. బాక్స్ లోపల బంతి ఉన్నప్పుడు సరిగా అటాక్ చేయలేకపోయారని అన్నాడు. తర్వాత వచ్చే ప్రపంచ కప్ సమయానికైనా సరైన జట్టు వస్తుందని తాను భావించడం లేదని చెప్పాడు.
argentina
fifa
world cup
maradona

More Telugu News