oomen chandy: ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఊమెన్ చాందీ

  • హైదరాబాదులోని ఇందిరాభవన్ కు వచ్చిన ఊమెన్ చాందీ
  • పలువురు సీనియర్ నేతలు హాజరు
  • పార్టీ బలోపేతంపై లోతుగా చర్చ
ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత హైదరాబాదులోని ఇందిరాభవన్ కు ఊమెన్ చాందీ తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కేవీపీ రామచంద్రరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సమావేశం సందర్భంగా పలు విషయాలపై వీరు చర్చించారు. ఏపీలో పార్టీ బలోపేతం, పార్టీకి దూరమైన నేతలను మళ్లీ ఆహ్వానించడంపై లోతుగా చర్చ జరిగింది. ఈ భేటీకి ఏఐసీసీ నూతన కార్యదర్శులు క్రిస్టఫర్, మరియప్పన్ లు కూడా పాల్గొన్నారు. ఊమెన్ చాందీ ఆధ్వర్యంలో జూలై 9 నుంచి 13వ తేదీ వరకు ఏపీలో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు.
oomen chandy
ap
congress

More Telugu News