MLA: నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే కుమారుడు రాజా.. వీడియో వైరల్

షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బన్స్‌వారా బీజేపీ ఎమ్మెల్యే ధన్‌సింగ్ రావత్ కుమారుడు రాజా నడిరోడ్డుపై తన స్నేహితులతో కలిసి రెచ్చిపోయాడు. తాము కారులో వెళుతోంటే ముందు కారులోని వ్యక్తి పక్కకు తప్పుకోలేదని ఆగ్రహంతో ఊగిపోయాడు.

దాంతో ఆ కారుకి అడ్డంగా తన కారుని పెట్టి ఆపాడు. అనంతరం దిగివచ్చి కారులోని వ్యక్తిని బయటకు లాగి చితక్కొట్టాడు. అంతే కాకుండా కారు అద్దాలను పగులకొట్టాడు. రాజాకు అతడి స్నేహితులు కూడా తోడయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.    
Go Back to Shorts
MLA
BJP
Rajasthan

More Telugu News