YSRCP: చంద్రబాబు, 'పప్పు' బాబులకి ఈసారి 25కి 25 ఎంపీ సీట్లు కావాలట!: జగన్‌ చురకలు

  • కొన్నాళ్ల క్రితం 15 మంది ఎంపీలు ఉన్నారు
  • బీజేపీలో ఇద్దరు ఉన్నారు
  • మరో ముగ్గురు ఎంపీలను వైసీపీ నుంచి కొనుక్కున్నారు
  • 25కి 20 ఎంపీలు పక్కనే ఉన్నారు.. అయినా పోరాడలేదు
'ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు 'పప్పు' బాబు ఇటీవల నిర్వహించిన మీటింగుల్లో మాట్లాడుతూ టీడీపీకి ఈ సారి 25కి 25 మంది ఎంపీలు కావాలని అంటున్నారు. కొన్నాళ్ల ముందు టీడీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు.. బీజేపీలో ఇద్దరున్నారు.. మరో ముగ్గురు ఎంపీలను వైసీపీ నుంచి కొనుక్కున్నారు. 25కి 20 మంది ఎంపీలు చంద్రబాబు పక్కనే ఉన్నారు.

ఇంత మంది ఎంపీలను పక్కన బెట్టుకుని చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు గాడిదలను కాస్తున్నారా? మళ్లీ ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు 'పప్పు' బాబు అడుగుతున్నారు. ఇప్పటికే 20 మంది ఎంపీలతోనే రాష్ట్రాన్ని ముంచేశారు.. ఇంక 25 మంది ఎంపీలు ఉంటే రాష్ట్రంలో మనల్ని బతకనిస్తారా? అని అడుగుతున్నాను. ఓ వైపు బీజేపీతో యుద్ధమని అంటారు.. మరోవైపు టీటీడీ బోర్డులో బీజేపీ నేత భార్యకు సభ్యత్వం కల్పించారు" అంటూ చంద్రబాబుని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం హైస్కూల్‌ సెంటర్‌ వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

"వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏమీ చేయకపోయినా మోదీని కలుస్తున్నారంటూ చంద్రబాబు తన మీడియాలో వేయించుకుంటున్నారు. మోదీ దేశానికి ప్రధానమంత్రి.. ఆయనకి ఏం పనీపాటా ఉండదా, ప్రతి రోజు విజయసాయిరెడ్డిని కలవడానికి? వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన సొంత పని మీద ఢిల్లీకి వెళ్లారు.. ఆయన ఢిల్లీలో రాంమాధవ్‌ ఇంటికి వెళ్లారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కానీ, బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు తన పక్కనే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని నిలదీయగానే పరకాల ప్రభాకర్‌తో రాజీనామా చేయించి డ్రామా ఆడారు. రాజీనామా చేశాకనయినా పరకాల ప్రభాకర్‌ను వదిలారా? లేదు" అని అన్నారు జగన్.  
YSRCP
Jagan
Telugudesam

More Telugu News