Virat Kohli: టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ

  • నిన్నటి మ్యాచ్‌లో 22 పరుగులు చేసిన కోహ్లీ
  • టీ20ల్లో కోహ్లీ ఖాతాలో 1,992 పరుగులు
  • జాబితాలో మొదటి రెండు స్థానాల్లో న్యూజిలాండ్ క్రికెటర్లు
పసికూన ఐర్లాండ్ తో నిన్న జరిగిన రెండో టీ20లో టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న ఆడిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 22 పరుగులు చేసి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (1,992) చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో న్యూజిలాండ్ క్రికెటర్లే ఉన్నారు. మార్టిన్ గప్తిల్ (2,271 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా, బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) రెండో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో కోహ్లీ మరో 8 పరుగులు చేస్తే భారత్‌ తరపున రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌ అవుతాడు. 
Virat Kohli
Cricket
India

More Telugu News