Chandrababu: సీఎం రమేష్ ను పరామర్శించిన చంద్రబాబు, నారా లోకేష్

  • కడప చేరుకున్న చంద్రబాబు, నారా లోకేష్
  • సీఎం రమేష్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి
  • వైద్య నివేదిక పరిశీలన
కడప ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు పరామర్శించారు. ఈరోజుతో ఆయన దీక్ష 11వ రోజుకు చేరుకుంది. కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఆయన దీక్ష కొనసాగుతోంది. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, దీక్షను ఆయన విరమించడం లేదు. తన ప్రాణం కంటే ఉక్కు పరిశ్రమ సాధనే ముఖ్యమని ఆయన చెప్పారు. మరోవైపు సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికను చంద్రబాబు పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. 
Chandrababu
Nara Lokesh
CM Ramesh

More Telugu News