mysura reddy: మళ్లీ టీడీపీలో చేరనున్న మైసూరా రెడ్డి?

  • టీడీపీలో చర్చనీయాంశంగా మారిన మైసూరా రెడ్డి
  • మళ్లీ టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
  • ఇప్పటికే సోమిరెడ్డితో మంతనాలు
రాయలసీమ సీనియర్ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డి మళ్లీ టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పలు విషయాలపై వీరు చర్చించారని సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే... టీడీపీలో మైసూరా చేరడం ఖాయమని చెబుతున్నారు. జులై మొదటి వారంలో ఆయన సైకిల్ ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ ప్రస్థానంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల్లో మైసూరా ఉన్నారు.
mysura reddy
Telugudesam
somireddy
join

More Telugu News