Suresh babu: తనను పార్టీకెందుకు పిలవలేదని తండ్రి సురేష్ బాబును ప్రశ్నించిన రానా!

  • సురేష్ బాబు నిర్మాతగా 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రం
  • హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ పార్టీ
  • ఫొటో పోస్టు చేస్తూ ప్రశ్నించిన రానా
మీరంతా పార్టీ చేసుకుంటూ నన్నెందుకు పిలవలేదని తన తండ్రి దగ్గుబాటి సురేష్ బాబును ప్రశ్నిస్తున్నాడు హీరో రానా. ఇంతకీ అసలు విషయం ఏంటంటారా? సురేష్ బాబు నిర్మాతగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఈ నగరానికి ఏమైంది?" సినిమా హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఓ హోటల్ లో పార్టీ చేసుకుంది. సురేష్ బాబుతో పాటు తరుణ్ భాస్కర్, చిత్రంలో నటించిన విష్వక్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, కే వెంకటేష్, అనీషా అంబ్రోస్, అభినవ్, సిమ్రన్ చౌదవి వంటి వారంతా ఒకచోట చేరారు. కాసేపు ఆనందంగా గడిపారు. ఇక ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రానా "నన్ను ఎందుకు పిలవలేదు?" అని ప్రశ్నించాడు. అదీ సంగతి.
Suresh babu
Rana
Daggubati Sureshbabu
Ee nagaraniki Emaindi
Party

More Telugu News