ravi sastri: ఆ దెబ్బకు అనుకున్న సమయానికంటే 10 నిమిషాల ముందే గంగూలీ వచ్చేవాడు: రవిశాస్త్రి
- టైమ్ కు రాకపోవడంతో గంగూలీని వదిలేసి వెళ్లిపోయాం
- టీమిండియాలో సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది
- నిర్ణీత సమయానికి అందరూ రావాల్సిందే
జట్టులో ఏ ఆటగాడైనా తప్పు చేస్తే తాను మరో అవకాశం ఇవ్వనని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఓ వెబ్ షోలో తన అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2007లో తాను టీమిండియాకు మేనేజర్ గా వ్యవహరించానని... అప్పుడు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లామని చెప్పాడు.
చిట్టగాంగ్ గ్రౌండ్ లో తొలి సెషన్ ఏర్పాటు చేశారని... ఉదయం తొమ్మిది గంటలకు ఆటగాళ్లతో బస్సు బయల్దేరాలని, దాంతో బస్సును పోనివ్వమని తాను చెబితే... గంగూలీ ఇంకా రాలేదని స్థానిక మేనేజర్ ఒకరు చెప్పారని... దీంతో, దాదా కారులో వస్తాడులే అని తాను చెప్పానని అన్నాడు. అలా గంగూలీని వదిలేసి తామంతా గ్రౌండ్ కు వెళ్లిపోయామని... అప్పటి నుంచి చెప్పిన సమయానికంటే 10 నిమిషాల ముందే గంగూలీ రెడీగా ఉండేవాడని తెలిపాడు. సమయపాలనను పాటిస్తేనే హుందాగా ఉంటుందని చెప్పాడు. టీమిండియాలో సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని... చెప్పిన సమయానికి అందరూ రావాల్సిందేనని తెలిపాడు.