Rajamouli: ఆ రెండు కొత్త సినిమాలపై రాజమౌళి ప్రశంసల జల్లు

షార్ట్స్‌లో చూడండి
విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి వంటి యువనటులు నటించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఈరోజు విడుదలైంది. అలాగే, సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ, నరేష్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేశ్, హరితేజ నటించిన సినిమా 'సమ్మోహనం' ఇటీవలే విడుదలైంది. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ రెండు సినిమాలను చూసిన దర్శకుడు రాజమౌళి తాజాగా ట్విట్టర్‌లో ప్రశంసించారు.           'ఈ నగరానికి ఏమైంది' సినిమా యూనిట్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలని జక్కన్న అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ మరోసారి నిరూపించారని, నవ్వులతో కూడుకున్న ఎంతో ప్రశాంతమైన సినిమా అని అన్నారు. అలాగే, 'సమ్మోహనం' సినిమాను కాస్త ఆలస్యంగా చూశానని, అదితి రావు హైదరి నటన ఎంతో నచ్చిందని అన్నారు. సుధీర్‌బాబు కూడా చక్కగా చేశాడని, నటుడు నరేశ్‌ పాత్ర వినోదభరితంగా ఉందని పేర్కొన్నారు.         
Go Back to Shorts
Rajamouli
Tollywood
Twitter

More Telugu News