sensex: వారాంతంలో.. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు!

  • ఎనర్జీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 386 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 10,714 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఎనర్జీ, ఫైనాన్షియల్ స్టాక్స్ అండతో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 386 పాయింట్లు పెరిగి 35,423కు ఎగబాకింది. నిఫ్టీ 125 పాయిట్లు లాభపడి 10,714కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్స్ (12.42%), జిందాల్ సా లిమిటెడ్ (12.38%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (12.12%), ఈఐడి ప్యారీ ఇండియా (11.46%), ఐడీబీఐ బ్యాంక్ (10.02%).  

టాప్ లూజర్స్:
దిలీప్ బిల్డ్ కాన్ (-5.00%), గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ (-4.20%), జైన్ ఇరిగేషన్ (-3.51%), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (-3.37%), బలరాంపూర్ చీనీ మిల్స్ (-3.06%). 

More Telugu News