kanna lakshminarayana: బీజేపీని దోషిగా నిలబెట్టి.. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు: కన్నా

  • టీడీపీవి కపట రాజకీయాలు
  • ప్రచారం కోసం నాటకాలు ఆడుతున్నారు
  • ఇందులో భాగంగానే సీఎం రమేష్ తో దీక్ష చేయిస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు విలువలు లేని రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని... ఇప్పుడేమో, ఎంపీ సీఎం రమేష్ తో స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేయిస్తున్నారని విమర్శించారు.

 ప్రచారం కోసం టీడీపీ నాటకాలు ఆడుతోందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టి... ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కుట్రలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.
kanna lakshminarayana
CM Ramesh
Chandrababu

More Telugu News