avanthi: మాకు సింపతి పెరగకూడదనే ఇలా చేస్తున్నారు: 'దీక్షల వీడియో'పై అవంతి శ్రీనివాస్‌

  • రాష్ట్రం కోసం పోరాడుతుంటే ఇటువంటివి చేస్తున్నారు
  • మేము దీక్షలు చేస్తున్నామని కుట్రలు పన్నుతున్నారు
  • ఆనాడు యూపీఏ హయాంలో రాష్ట్రానికి అన్యాయం 
  • ఇప్పుడు కూడా ఎన్డీఏ మోసం చేస్తోంది   
తాము దీక్షలపై పలు వ్యాఖ్యలు చేశామని వస్తోన్న వీడియో ఫేక్‌ అని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలకి రాష్ట్ర సమస్యలపై చిత్తశుద్ధి లేదని కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు.

కేంద్ర సర్కారుపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే క్రమంలో తాము దీక్షలు చేస్తున్నామని, తమకు సింపతి పెరగకూడదనే ఇలా చేస్తున్నారని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాడుతున్నారో వారి ఇమేజ్‌ దెబ్బ తీయాలనే ఇటువంటివి చేస్తున్నారని చెప్పారు. ఆనాడు యూపీఏ హయాంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఎన్డీఏ కూడా మోసం చేస్తోందని ఆరోపించారు.   
avanthi
Telugudesam
Andhra Pradesh

More Telugu News