murali mohan: 'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' వీడియోపై ఎంపీ మురళీ మోహన్‌ స్పందన

  • కొందరు ఆ వీడియోను మార్ఫింగ్‌ చేశారు
  • అదంతా మీడియా సృష్టే
  • టీవీలు, సోషల్ మీడియాల్లో వైరల్ అయింది      
'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' అంటూ టీడీపీ ఎంపీలు ఓ గదిలో మాట్లాడుకుంటుండగా తీసిన ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాను ఐదు కేజీల వరకూ బరువు తగ్గాలని అనుకుంటున్నానని ఓ వారం రోజుల పాటు దీక్షలో కూర్చోగలనని ఎంపీ మురళీ మోహన్‌ అనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

దీనిపై మురళీ మోహన్‌ స్పందించారు. కొందరు ఆ వీడియోను మార్ఫింగ్‌ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అదంతా మీడియా సృష్టేనని టీవీలు, సోషల్ మీడియాల్లో వైరల్ అయిందని అన్నారు. ఏపీ సమస్యలపై మీడియాకు బాధ్యత ఉండాలని హితవు పలికారు. కాగా, కడపజిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మెకాన్ సంస్థకు లేఖ రాయించాలని కేంద్ర సర్కారు చెప్పిందని తెలిపారు.            
murali mohan
Andhra Pradesh
Viral Videos

More Telugu News