'తిరుమల శ్రీవారి నగలు మాయం' పై పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
- దేవుని నగలు మాయం చేస్తున్నారు
- గుడి లోపల తవ్వకాలు సాగిస్తున్నారు
- భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న పిటిషనర్లు
- మంగళవారం విచారణకు రానున్న పిటిషన్
పురాతన ఆస్తులను, స్వామివారి నగలను కాపాడేందుకు వెంటనే తగిన ఆదేశాలు ఇవ్వాలని అనిల్ కుమార్, గోస్వామి అనే భక్తులు కోర్టును ఆశ్రయించగా, విచారించేందుకు న్యాయస్థానం నిర్ణయించింది. ఈ కేసు మంగళవారం నాడు విచారణకు రానుండగా, టీటీడీ పాలకమండలి, ఈఓ, ఏపీ ప్రభుత్వాలకు సమాధానం ఇవ్వాలని కోర్టు నోటీసులను పంపనున్నట్టు సమాచారం.