sarath kumar: సినీ నటుడు శరత్ కుమార్ పై కేసు నమోదు

  • నడిగర్ సంఘం ఆస్తులను అమ్మేశారంటూ కేసు
  • పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు
  • గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్
ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ పై తమిళనాడులోని కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కేఆర్ సెల్వరాజ్, నటేశన్, రాధారవిలపై కేసు బుక్ చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని విక్రయించిన వ్యవహారంలో వీరిపై కేసు నమోదైంది.

గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్ కుమార్, కోశాధికారిగా రాధారవిలు ఉన్న సమయంలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంచీపురం జిల్లాలో నడిగర్ సంఘానికి ఉన్న 26 సెంట్ల స్థలాన్ని వీరు విక్రయించినట్టు... ప్రస్తుత సంఘ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదైంది. 
sarath kumar
kollywood
case
nadigar

More Telugu News