CM Ramesh: సీఎం రమేష్‌ ఆరోగ్యం ఎలా ఉంది?: వెంకయ్య నాయుడు వాకబు

  • కోల్‌కతాలో వెంకయ్య పర్యటన
  • కడప జిల్లా కలెక్టర్‌కి ఫోన్‌
  • కొనసాగుతోన్న ఎంపీ రమేష్‌ దీక్ష
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో పర్యటిస్తోన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు... సీఎం రమేష్‌ దీక్షపై ఆరా తీశారు. కోల్‌కతా రాజ్‌భవన్‌ నుంచి కడప జిల్లా కలెక్టర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. సీఎం రమేష్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా, తన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కడపలో ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన హామీ వచ్చేవరకు తాను నిరాహార దీక్ష విరమించబోనని సీఎం రమేష్‌ అంటున్నారు.                              
CM Ramesh
Venkaiah Naidu
Telugudesam

More Telugu News