Deepika Padukone: సినీ జీవితం ప్రారంభించిన కొత్తలో నన్ను అలా చేయమని చెప్పారు: హీరోయిన్‌ దీపికా పదుకునె

  • ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చారు
  • నాకు చాలా చెత్త సలహాలు ఇచ్చారు
  • దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడటానికి సలహాలిచ్చారు
  • కొన్ని చేయకూడని పనులను చేయాలని అన్నారు
తన సినీ జీవితం ప్రారంభించిన సమయంలో తనపై చాలా మంది ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చారని, తనకు చాలా చెత్త సలహాలు ఇచ్చారని బాలీవుడ్‌ హీరోయిన్ దీపికా పదుకునె చెప్పింది. బాలీవుడ్ దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడటానికి కొన్ని చేయకూడని పనులను చేయాలని కొందరు తనకు చెప్పారని, కానీ తాను అలా చేయలేదని తెలిపింది.

తాజాగా దీపిక ఓ ఇంటర్వ్యూలో.. మహిళలపై లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. తాను తన ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్నానని చెప్పింది. మహిళలు తాము ఎదుర్కున్న వేధింపులను 'మీటూ' వంటి వాటితో బయట పెడుతున్నారని, అటువంటివి హాలీవుడ్‌, బాలీవుడ్ పరిశ్రమల్లో గొప్ప మార్పులకు కారణమయ్యాయని తెలిపింది. ఈ అంశంపై సరైన దిశలో అడుగులు పడుతున్నాయని, మన దేశంలోనూ అదే జరుగుతుందని ఆమె పేర్కొంది.
Deepika Padukone
Bollywood

More Telugu News