BJP: బీజేపీతో కలిసి ఉన్న పవన్‌ కల్యాణ్‌తో వామపక్షాలు ఎలా కలుస్తాయి?: యనమల రామకృష్ణుడు

  • పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న వ్యాఖ్యలు అవగాహన రాహిత్యమే
  • మా ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది
  • జగన్ పర్యటిస్తోన్న రహదారులన్నీ మా ప్రభుత్వం అభివృద్ధి చేసినవే
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమతో కలిసే పనిచేస్తారని ఇటీవల సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న పవన్‌ కల్యాణ్‌తో వామపక్షాలు ఎలా కలుస్తాయని ప్రశ్నించారు.

అలాగే, కడప ఉక్కు పరిశ్రమకు టీడీపీ అడ్డుపడుతోందన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యమేనని అన్నారు. కేంద్ర సర్కారు సాయం అందించి ఉంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేవాళ్లమని చెప్పారు. తెలుగుదేశం సర్కారు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని అన్నారు.                                                                
BJP
Yanamala
Pawan Kalyan

More Telugu News