minister: ఏరువాకలో అపశ్రుతి.. కాలుజారి కిందపడ్డ మంత్రి దేవినేని

  • కృష్ణా జిల్లాలోని గొల్లపూడిలో సంఘటన
  • భారీ సౌండ్ సిస్టమ్, బాజాభజంత్రీలకు బెదిరిన ఎద్దులు
  • కిందపడ్డ ఉమను పైకి లేవదీసిన మీడియా ప్రతినిధులు
కృష్ణా జిల్లాలోని గొల్లపూడిలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాడెద్దులు బెదిరి పరుగులు తీయడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాలు జారి కిందపడ్డారు. భారీ సౌండ్ సిస్టమ్, బాజాభజంత్రీలు ఏర్పాటు చేయడంతో ఎద్దులు బెదరడంతో ఈ సంఘటన జరిగింది. కిందపడ్డ దేవినేని ఉమను అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు పైకి లేపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారిలో చాలా మంది కూడా కిందపడిపోయారు. గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. 
minister
devineni
eruvaka

More Telugu News