heroine punam kaur: మోదుగమూడి కిషన్-చంద్రలు అసలు భార్యాభర్తలే కాదు: హీరోయిన్ పూనమ్ కౌర్

షార్ట్స్‌లో చూడండి
చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన నిందితులు కిషన్ మోదుగమూడి, అతని భార్య చంద్రలను అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. కిషన్-చంద్రలు అసలు భార్యాభర్తలే కాదని, లగ్జరీ జీవితం గడిపేందుకు, ఇలాంటి నేరాలు చేసేందుకే వాళ్లిద్దరూ అలా నటిస్తున్నారని ఆరోపించింది.

 ఈ సందర్భంగా ఓసారి తాను అమెరికా వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను ఆమె ప్రస్తావించింది. తాను బస చేసిన హాటల్ దగ్గరకు కిషన్-చంద్రలకు సంబంధించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వచ్చి గది తలుపు తట్టాడని చెప్పింది. ఆ సమయంలో అతను ప్రవర్తించిన తీరుతో తనకు కోపం వచ్చి, అతని చెంప పగలగొట్టానని చెప్పుకొచ్చింది. అమెరికాలో డబ్బు ఆశ చూపో లేక భయపెట్టో మన దేశ అమ్మాయిలను లొంగదీసుకుంటారని, ఇలా మోసపోతున్న అమ్మాయిలను కాపాడాలని ప్రధాని మోదీకి పూనమ్ కౌర్ విజ్ఞప్తి చేసింది.
Go Back to Shorts
heroine punam kaur
chicago S*x rocket

More Telugu News