kcr: విజయవాడ చాలా బాగుందంటూ కితాబునిచ్చిన కేసీఆర్

  • బందరు రోడ్డును బాగా విస్తరించారు
  • బందరు రోడ్డు నుంచి గన్నవరం వరకు గ్రీనరీ బాగుంది
  • సీఎంగా మళ్లీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా
విజయవాడ ఎంతో అభివృద్ధి చెందిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబునిచ్చారు. బందరు రోడ్డును బాగా విస్తరించారని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు బాగున్నాయని చెప్పారు. బందరు రోడ్డు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీనరీ చాలా బాగుందని మెచ్చుకున్నారు. గన్నవరం విమానాశ్రయం కూడా బాగుందని అన్నారు. కనకదుర్గమ్మ దర్శనం బాగా అయిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా మళ్లీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడకను సమర్పించి... కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. 
kcr
Vijayawada

More Telugu News